ముస్లిం బస్తీ సమస్యల పరిష్కారానికి కృషి

ముస్లిం బస్తీ సమస్యల పరిష్కారానికి కృషి
  • ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​యాదవ్​

సికింద్రాబాద్, వెలుగు: అమీర్​పేట డివిజన్‌‌‌‌‌‌‌‌లో ముస్లిం బస్తీలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సనత్​నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్నికైన ముస్లీం బస్తీ కమిటీ సభ్యులు మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు.

బస్తీలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సనత్‌‌‌‌‌‌‌‌నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు  శాశ్వత పరిష్కారం చూపామన్నారు. బస్తీలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధ్యక్షుడు నసీరుద్దీన్, ఉపాధ్యక్షుడు మహ్మద్ అంజద్, ప్రధాన కార్యదర్శి నిసారుద్దీన్, సలహాదారు సయ్యద్ అథిక్, అహ్మద్ ఉన్నారు.